స్వాగతం | సుస్వాగతము | భారతీ శంకర పీఠం

 

హైందవ ధర్మం అతి సనాతన ధర్మాలలో ఒకటి. విశ్వకల్యాణమే ధర్మంగా, ఉద్దేశంగా సాగుతున్న మతాలలో హిందూ మతం ఒకటి. హైందవ సనాతన గొప్పతనాన్ని ప్రజలు మరింత లోతుగా తెలుసుకునేందుకు వీలుగా, హైందవ ధర్మ సంస్కృతి పరిరక్షణ కోసం బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తిగారిచే స్థాపించబడింది ఈ భారతీ శంకర పీఠం. హిందూ ధర్మాన్ని , ఆచారాలను, సంస్కృతిని పరిరక్షించడం, ధర్మ ఔన్నత్యానికి కృషి చేయడమే విధిగా, అది మా భాగ్యంగా భావిస్తున్నాం. ధర్మాన్ని రక్షిస్తే.. ఆ ధర్మమే మనను రక్షిస్తుంది అని నమ్ముతూ.. ధర్మ వ్యాప్తికి కృషి చేయాలని సంకల్పించాము. దీని కోసం జీవన సారాన్ని, ధర్మ సారాన్ని బోధించి నిగూఢ రహస్యాలను వెల్లడించే వేదాలను సంరక్షించడం భారతీ శంకర పీఠం బాధ్యతగా తీసుకుంది.

వేద పరిరక్షణ నిమిత్తం నిష్ణాతులైన వేద పండితులతో వేద సభలు ఏర్పాటు చేసి వేద ప్రాశస్త్యం, దివ్యత్వాన్ని పరివ్యాప్తి చేయడం జరుగుతుంది. అంతే కాకుండా వేద పాఠశాల నిర్వహణ కూడా చేయడానికి మా కృషి కొనసాగుతుంది. ఆ సంకల్పంతో పాటు గోశాల నిర్వాహణ, మహా త్రిపురసుందరీసహిత మహాలింగ మృత్యుంజయ ఆలయ (శివాలయం) నిర్మాణం చేయడం కూడా మా అభిమతం. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. అందుకే నిత్యాన్నదానం చేయడంతో పాటు, లోక కల్యాణం కోసం యజ్ఞయాగాది క్రతువులను బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తిగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.

Me Purohith

మా సర్వీసెస్

 • your poojari 1

  జ్యోతిష్యం

  జ్యోతిష్యం

  ఈ సృష్టిలో ఏ స‌మ‌యంలో ఏం జరగనుందో అని తెలిపే అద్భుతమైన శాస్త్రమే జ్యోతిష్యం.

 • your poojari 5

  వాస్తు

  వాస్తు

  వాస్తు శాస్త్రం అనగా నివాసం ఉండే గృహం లేదా ప్రదేశాన్ని రక్షించేదని అర్థం.

 • your poojari 1

  ముహూర్తం

  ముహూర్తం

  హిందూ ధర్మానుసారంగా ప్రతి శుభకార్యము ముహూర్తాన్ని అనుసరించి చేయడం.

 • your poojari 2

  వైదికం

  వైదికం

  వేదాలలో చెప్పబడిన క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించబడును.

 • your poojari 5

  హోమాలు

  హోమాలు

  (గణపతి హోమం, రుద్ర హోమం ,చండి హోమం,వాస్తు హోమం ,నవగ్రహ హోమం,మృత్యుంజయ హోమం )

 • your poojari 5

  జప శాంతులు

  జప శాంతులు

  (కాలసర్ప శాంతి ,కుజదోష శాంతి ,నవగ్రహ శాంతి ,నక్షత్ర శాంతి)

అప్పాయింట్మెంట్ కొరకు